సమంత, చైతన్య ‘మజిలీ’కి ప్రశంసల వర్షం !

Published on Apr 5, 2019 2:53 pm IST

మొత్తానికి సమంత, నాగ చైతన్య మళ్లీ చాలా సంవత్సరాల తరువాత కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో నటించిన మజిలీ చిత్రం ఈ రోజు విడుదల అయి మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. పెళ్లి తర్వాత చైతు, సమంత కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడంతో ఈ చిత్రం పై పలువురు సినీ ప్రముఖులు కూడా ప్రత్యేకమైన శ్రద్ద చూపిస్తున్నారు. సినిమా గురించి ట్విటర్‌ వేదికగా సమంత, చైతన్యల పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అక్కినేని నాగార్జున మజిలీ గురించి స్పందిస్తూ.. నాగ చైతన్య, సమంత సినిమాలో అద్భుతంగా నటించారు. వాళ్ళను చూసి న నేనిప్పుడు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇక సినిమాలో కీలకమైన పాత్రల్లో నటించిన రావు రమేశ్‌, పోసాని నటన కూడా సూపర్‌. మొత్తం ‘మజిలీ’ చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్‌’ అని తెలిపారు.

అలాగే హరీశ్‌ శంకర్‌ మజిలీ గురించి స్పందిస్తూ. ‘ చైతన్య, సమంత దంపతులకు ఈ ప్రపంచంలోని ప్రశంసలన్నీ దక్కాలి. శివ నిర్వాణ తన స్క్రిప్ట్ తో మరియు తమన్‌ తన నేపథ్య సంగీతంతో భావోద్వేగ సన్నివేశాలకు ప్రాణం పోశారు. కచ్చితంగా ‘మజిలీ’ సినిమాను చూడండి. మొత్తానికి సున్నితమైన చిత్రంతో ఈ వేసవి ప్రారంభమైంది’ అని చెప్పుకొచ్చారు.

మంచు మనోజ్‌ కూడా మజిలీ గురించి స్పందిస్తూ. క్యూట్‌ దంపతులు చైతన్య, సమంత కలిసి అందించిన ఈ అందమైన భార్యాభర్తల భావోద్వేగాల ప్రయాణం ‘మజిలీ’ చాలా బాగుంది. చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు’ అని పోస్ట్ చేసారు.

సంబంధిత సమాచారం :