“మనీ హీస్ట్ జల్దీ ఆవో” అంటున్న సెలబ్రిటీస్!

Published on Aug 23, 2021 4:09 pm IST

ఊహించని రీతిలో వెబ్ సిరీస్ ల హవా కొనసాగుతోంది. ఇంటర్నేషనల్ వెబ్ సిరిస్ లను సైతం ఇండియన్స్ ఆదరిస్తున్నారు. మనీ హీయిస్ట్ అంటూ వచ్చిన వెబ్ సిరీస్ నాలుగు సీజన్ లు కూడా భారీ రెస్పాన్స్ ను రాబట్టింది. నాలుగు సీజన్ లు కూడా విజయం సాధించడం తో ఐదవ సీజన్ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఐదవ సీజన్ ఈ సెప్టెంబర్ 3 వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది.

మనీ హీస్ట్ వెబ్ సిరీస్ కోసం మన సెలబ్రిటీ లు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అందుకు సంబంధించిన ప్రమోషనల్ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ పాట లో ప్రముఖ నటి శృతి హాసన్, రానా దగ్గుపాటి, హర్డిక్, రాధిక ఆప్టే, విక్రంత్ మరియు నుక్లేయ లు కనిపిస్తున్నారు. వీరంతా కూడా మని హీస్ట్ జల్ది ఆవొ అంటున్నారు.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :