ఎనర్జిటిక్ డ్యాన్సులతో హోరెత్తించనున్న నాగ చైతన్య !

ఎనర్జిటిక్ డ్యాన్సులతో హోరెత్తించనున్న నాగ చైతన్య !

Published on Jun 4, 2018 12:41 PM IST

అక్కినేని హీరో నాగ చైతన్య ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’. ఇన్నాళ్లు చందూ మొండేటితో చేస్తున్న ‘సవ్యసాచి’ పనుల్లో బిజీగా ఉండి మారుతికి సరిగ్గా డేట్స్ ఇవ్వలేకపోయిన చైతన్య ఇప్పుడు ఎక్కువ సమయాన్ని ఆయన సినిమాకే కేటాయిస్తున్నారు. దీంతో మారుతి చక చకా సినిమాను కానిచ్చేస్తున్నారు.

తాజాగా మొదలైన ఈ షెడ్యూల్లో వరుసగా రెండు పాటల్ని చిత్రీకరించారు. ప్రముఖ కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్ ఈ పాటలకు నృత్యాల్ని కంపోజ్ చేశారు. ఈ పాటలు గురించి మారుతి మాట్లాడుతూ చైతూ సూపర్ ఎనర్జిటిక్ డ్యాన్సులు చేశారని కితాబిచ్చారు. దీన్నిబట్టి చూస్తే సినిమాలో చైతూ డ్యాన్సులతో హోరెత్తించాడని అర్థమవుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో చైతూకి జోడీగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు