ఎప్పటికి మర్చిపోలేని హిట్ ఇచ్చాడు – చైతు

Published on Apr 16, 2019 10:42 pm IST

నాగ చైతన్య – సమంత హీరోహీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ‘మజిలీ’ మంచి పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను సాధిస్తోంది. కాగా చిత్రబృందం ఈ రోజు సక్సెస్ మీట్ ను నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ లో చిత్రబృందం మొత్తం పాల్గొంది.

ఈ సందర్భంగా చైతు మాట్లాడుతూ.. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ కావడానికి కారణమయిన ప్రేక్షకులకు చాలా థాంక్స్.. అందరు కలిసి ఎంతో కష్టపడి ఈ సినిమా చేసారు. ఈ హిట్ అందరికి అంకితం.. శివ ఎప్పటికి మర్చిపోలేని హిట్ ఇచ్చాడు. అని తెలిపారు.

చైతు ఇంకా మాట్లాడుతూ.. ‘శివ నాకు ఇంపార్టెంట్ టైంలో మంచి హిట్ ఇచ్చాడు. ప్రొడ్యూసర్స్ మంచి సపోర్ట్ చేశారు. పెద్ద పెద్ద ఆర్టిస్ట్స్ లతో నటించాను.. మంచి అనుభూతిని ఇచ్చింది. తమన్ ఈ సినిమా కి మంచి లైఫ్ ఇచ్చాడు.. చాలా థాంక్స్. అని చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం :