సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఛల్ మోహన్ రంగ’ !

2nd, April 2018 - 11:44:49 PM


నితిన్, మేఘా ఆకాష్ లు జంటగా నటించిన చిత్రం ‘ఛల్ మోహన్ రంగ’. దర్శకుడు కృష్ణ చైతన్య డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఈ నెల 5వ తేదీన విడుదలకానుంది. అందుకే చిత్ర టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని శరవేగంగా ముగిస్తోంది. వాటిలో భాగంగానే సెన్సార్ పనులు కూడ కొద్దిసేపటి క్రితమే పూర్తయ్యాయి.

సెన్సార్ సభ్యులు చిత్రానికి క్లీన్ ‘U’ సర్టిఫికెట్ ను జారీచేశారు. ఫుల్ లెంగ్త్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండబోతున్న ఈ చిత్రానికి సంబందించిన పాటలు, ట్రైలర్ అన్నీ ప్రేక్షకుల నుండి మంచి స్పందన తెచ్చుకున్నాయి. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, సుధాకర్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మించారు.