‘ఛల్ మోహన్ రంగ’ ఆడియో అప్డేట్ !
Published on Feb 20, 2018 5:48 pm IST

హీరో నితిన్ చేస్తున్న 25వ చిత్రం ‘ఛల్ మోహన్ రంగ’. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకులు, అభిమానులకు తెగ నచ్చేసింది. త్రివిక్రమ్ కథను అందించడం పవన్ కళ్యాణ్ తన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై సినిమాను నిర్మిస్తుండటంతో అంచనాలు కూడ మంచి స్థాయిలోనే ఉన్నాయి.

ఇకపోతే ఈ చిత్ర ఆడియోను ఇప్పటికే సిద్ధం చేసిన టీమ్ మొదటి పాటను ఈ వారంలోనే రిలీజ్ చేయనుంది. ఈ ఏడాది ‘భాగమతి, తొలి ప్రేమ’ వంటి వరుస విజయాలను అందుకున్న థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించడంతో పాటలు బాగుంటాయనే నమ్మకం అందరిలోనూ ఉంది. ఇకపోతే ఈ చిత్రంలో నితిన్ కు జోడీగా ‘లై’ ఫేమ్ మేఘా ఆకాష్ నటిస్తోంది. కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నారు..

 
Like us on Facebook