ఓవర్సీస్లో ‘ఛల్ మోహన్ రంగ’ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే !

నితిన్, మేఘా ఆకాష్ లు జంటగా నటించిన తాజ్ చిత్రం ‘ఛల్ మోహన్ రంగ’ చిత్రం గత బుధవారం మంచి అంచనాలు నడుమ విడుదలై చెప్పుకోదగిన ఓపెనింగ్స్ రాబట్టుకుంది. పవన్ కళ్యాణ్ నిర్మాణం కావడంతో ఓవర్సీస్లో కూడ సినిమాపై అంచనాలు మంచి స్థాయిలోనే ఉండి, చిత్రానికి మంచి రిలీజ్ కూడ లభించండంతో మొదటి రోజు గురువారం ఓపెనింగ్స్ డీసెంట్ గా ఉన్నాయి.

శుక్రవారం కూడ 78,421 డాలర్లను కలెక్ట్ చేసిన ఈ చిత్రం మొత్తంగా 2.90 లక్షల డాలర్లను ఖాతాలో వేసుకుంది. కృష్ణ చైతన్య డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందించగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కథను అందించి, నిర్మాణంలో కూడ పాలు పంచుకున్నారు.