“మాస్టర్ చెఫ్” జడ్జ్ గా చలపతి రావు

Published on Aug 25, 2021 11:00 pm IST

సినిమాల కి ధీటుగా బుల్లితెర కార్యక్రమాలు తమ సత్తా చాటుతున్నాయి. జెమిని టివి లో ప్రసారం కానున్న మాస్టర్ చెఫ్ కోసం యాజమాన్యం సన్నాహాలు చేస్తుంది. ఈ కార్యక్రమం కి మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మిల్కీ బ్యూటీ రాక తో ఈ షో పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ ప్రోగ్రాం కి సంబంధించిన మరొక అప్డేట్ ను జెమిని టీవీ వెల్లడించడం జరిగింది. మాస్టర్ చెఫ్ కి జడ్జి ను నియమించినట్లు తెలుస్తోంది.

మనకి తెలియని తెలుగు వంటలను పరిచయం చేయడానికి, జడ్జ్ గా వ్యవహరించడానికి చలపతి రావు సరికొత్తగా వస్తున్నారు. ఇన్నోవేటివ్ ఫుడ్ ఐడియాస్ తో ఈ నెల 27 వ తేదీన రానున్నారు. ఈ కార్యక్రమం ఆగస్ట్ 27 నుండి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. శుక్ర మరియు శని వారాలు రాత్రి 8:30 గంటలకు ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. తెలుగు వంటలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు సరికొత్తగా ముస్తాబు అయినట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :