విజువల్స్, మ్యూజిక్ తో ఇంప్రెస్ చేయనున్న ‘ఛలో’ !

యంగ్ హీరో నాగ శౌర్య నటించిన తాజా చిత్రం ‘ఛలో’. చివరి దశ పనుల్లో ఉన్న ఈ సినిమా ఈ డిసెంబర్ 29న విడుదలకావడానికి సిద్ధమవుతోంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ల స్పీడు పెంచింది. అందులో భాగంగానే ఇటీవలే సినిమాలోని ఒక వీడియో పాటను రిలీహ్ చేశారు. రొమాంటిక్ ఫ్లోలో సాగే ఈ పాటలో విజువల్స్ క్లిస్టర్ క్లియర్ కనిపిస్తూ చాలా బాగున్నాయి.

అంతేగాక మహతి స్వర సాగర్ అందించిన సంగీతం ఆహ్లాదకరంగా అనిపిస్తోంది. దీన్నిబట్టి సినిమా కూడా ఇలానే విజువల్ ట్రీట్ గాను, మంచి మ్యూజిక్ సెన్స్ కలిగిన చిత్రంగాను ఉండనుందని తెలుస్తోంది. కన్నడ హీరోయిన్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని నాగ శౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పై ఉషా ముల్పూరి, శంకర ప్రసాద్ లు నిర్మించగా నూతన దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్ట్ చేశారు.

వీడియో సాంగ్ కొరకు క్లి చేయండి: