‘కార్తికేయ – 2 ‘తో హిట్ కొడతాడట !

‘కార్తికేయ – 2 ‘తో హిట్ కొడతాడట !

Published on Jul 17, 2019 11:02 AM IST

దర్శకుడు చందు మొండేటి – హీరో నిఖిల్ కాంబినేషన్ లో ‘కార్తికేయ – 2 ‘ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పుర్తయింది. స్క్రిప్ట్ లో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అలాగే ఓ కొత్త కాస్పెక్ట్ హైలెట్ అవునున్నాయట. పైగా సినిమాలో ఎక్కడా ఎంటర్ టైన్మెంట్ తగ్గకుండా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఎలాగు ‘కార్తికేయ’ సినిమాతోనే డైరెక్టర్ గా మంచి డిమాండ్ తెచ్చుకున్న చందు.. మళ్ళీ నిఖిల్ తో ‘కార్తికేయ 2’ తీసి… తిరిగి మళ్ళీ ఫామ్ లోకి వస్తాడని చెబుతుంది చిత్రబృందం.

ఇక ఈ చిత్రాన్ని ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రంలోని ఇతర నటీనటులు మరియు సాంకేతికవర్గానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు