రూమర్ల మీద క్లారిటీ వచ్చిన ప్రముఖ నటుడు

Published on May 25, 2021 5:05 pm IST

ఎవరైనా సీనియర్ నటీనటులు ఎక్కువ కాలం కనబడకపోతే వారి ఆరోగ్యం బాగోలేదనో లేకపోతే చనిపోయారనో పుకార్లు పుట్టుకురావడం కామన్ అయిపోయింది. ఇలాంటి వార్తల కారణంగా చాలామంది ప్రముఖులు ఇబ్బందులు పడ్డారు. తాజాగా ప్రముఖ సీనియర్ నటుడు చంద్రమోహన్ సైతం ఇదే తరహాఇబ్బందిని ఎదుర్కొన్నారు. ఎన్ని వందల చిత్రాల్లో చిత్రాల్లో నటించిన చంద్రమోహన్ చాలాకాలం నుండి సినిమాలు చెయ్యట్లేదు.

ప్రస్తుతం ఆయన వయసు 80 సంవత్సరాలు. ఇంత వయసులో శ్రమ ఎందుకు అనుకున్న ఆయన నటనకు ఫులుస్టాప్ పెట్టి ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. అలాంటి ఆయన మీద అనారోగ్యం కారణంగా ఈరోజు చెన్నైలో కన్నుమూశారని పుకార్లు పుట్టుకొచ్చాయి. దీంతో వెంటనే స్పందించిన చంద్రమోహన్ తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని, తనకు ఎలాంటి సమస్యలు లేవని, ఇంట్లోనే హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నానని, అందరి ఆశీస్సులే తనకు శ్రీరామరక్ష అంటూ అన్నారు.

సంబంధిత సమాచారం :