కళకళలాడుతున్న ‘చంద్రకళ’ కలెక్షన్స్

కళకళలాడుతున్న ‘చంద్రకళ’ కలెక్షన్స్

Published on Dec 24, 2014 5:40 PM IST

Chandrakala
ఆసక్తికరమైన కథ, కథనాలతో హారర్ కామెడీ నేపధ్యంలో తెరకెక్కిన సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ పుష్కలంగా ఉంటుందని ‘చంద్రకళ’ సినిమా మరోసారి నిరూపించింది. హన్సిక, ఆండ్రియా, రాయ్ లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. విడుదలైన నాలుగు రోజుల్లో ఈ సినిమా 1.70 కోట్ల రూపాయలను వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాలలో 360 ప్రింట్లతో విడుదలైన ఈ సినిమా వీకెండ్ తర్వాత సోమవారం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది.

తమిళ హాస్య నటుడు సంతానం ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాలో సుందర్ సి హీరో. ఆయనే దర్శకుడు కూడా. ఈ తమిళ హారర్ కామెడీ సినిమాను ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ తెలుగులో అనువదించారు. ఈ విజయం సాదించడంతో నిర్మాత సంతోషాన్ని వ్యక్తం చేశారు.

తాజా వార్తలు