రిస్క్ ఎందుకని తప్పుకుంటున్న ధరమ్ తేజ్

Published on Apr 20, 2021 9:00 pm IST

మెగా హీరో సాయి తేజ్ చేసున్న కొత్త చిత్రం ‘రిపబ్లిక్’. దేవ కట్ట దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇన్నాళ్లు యూత్ ఫుల్ ఎంటెర్టైనర్లు చేస్తూ వచ్చిన సాయి తేజ్ మొదటిసారి చేస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ ఇది. ‘ప్రస్థానం’ లాంటి డెప్త్ ఉన్న సినిమా చేసిన దేవ కట్ట ఈ సినిమాకు దర్శకుడు. ఇప్పటికే సినిమా నుండి వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులకు నచ్చాయి. ఈ సినిమాను జూన్ 4న విడుదల చేయాలని అనుకున్నారు నిర్మాతలు. కానీ ఇప్పుడు ఆ నిర్ణయం మారేలా ఉంది.

కరోనా సెకండ్ వేవ్ రీత్యా సినిమాల చిత్రీకరణలు ఆగిపోతున్నాయి. 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనతో విడుదలలు వాయిదాపడ్డాయి. ఏప్రిల్, మే నెలలో విడుదలకావాల్సిన చాలా సినిమాలు వెనక్కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. వెనక్కి వెళ్లిన ఆ సినిమాలన్నీ జూన్ నెలకు షిఫ్ట్ అవ్వొచ్చు. అదే జరిగితే బాక్సాఫీస్ వద్ద తీవ్రమైన పోటీ తప్పదు. ఒకవేళ అప్పటికీ సినిమా హాళ్లు 100 శాతం ఆక్యుపెన్సీతో లేకపోతే జూన్ సినిమాలు కూడ వాయిదా పడాల్సిందే. అందుకే ఈ చిక్కులన్నింటి మధ్యన సినిమాను విడుదల చేస్తే రిస్క్ అనుకున్న ‘రిపబ్లిక్’ సినిమా నిర్మాతలు విడుదల తేదీని మార్చాలని డిసైడ్ అయ్యారట. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలువడవచ్చు కూడ.

సంబంధిత సమాచారం :