‘బ్రూస్‌లీ’ ఆడియో రిలీజ్ ఎప్పుడు?

‘బ్రూస్‌లీ’ ఆడియో రిలీజ్ ఎప్పుడు?

Published on Sep 20, 2015 9:49 PM IST

brusli
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు శ్రీనువైట్లల క్రేజీ కాంబినేషన్‌లో భారీ ఎత్తున ‘బ్రూస్‌లీ’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులే కాక ఇండస్ట్రీ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇక సెట్స్‌పైకి వెళ్ళకముందు నుంచే ఎంతో ఆసక్తికరంగా కనిపించిన ఈ సినిమా, ఇప్పుడు చివరిదశకు చేరి మరో నెలరోజుల్లో విడుదలకు సిద్ధమయ్యేసరికల్లా విపరీతమైన అంచనాలను మూటగట్టుకుంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఆడియో రిలీజ్ విషయమై అభిమానులకు ఇప్పటికీ ఓ స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో ఆడియో రిలీజ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’ లాంటి పెద్ద సినిమాల తర్వాత ఆ స్థాయి అంచనాలతో వస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుకను నిర్వహించాలని బ్రూస్‌లీ టీమ్ ప్లాన్ చేస్తోంది. ముందుగా అనుకున్నట్లుగా సెప్టెంబర్ 26 లేదా 27న కాకుండా రీసెంట్‌గా అక్టోబర్ 2న ఆడియో రిలీజ్ జరిపేందుకు సినిమా యూనిట్ ప్లాన్ చేస్తోందని సమాచారం.

మెగా ఫ్యామిలీ హీరోల సమక్షంలో భారీ ఎత్తున ఈ వేడుక జరగనుందని తెలుస్తోంది. కాగా ఈ విషయమై బ్రూస్‌లీ టీమ్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఏదీ రాలేదు. మెగాస్టార్ చిరంజీవి ఓ గెస్ట్ రోల్‌లో కనిపించనున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు