రాజ్ తరుణ్ హీరోయిన్ హీరోయిన్ మారింది ?

24th, December 2017 - 05:11:14 PM

యంగ్ హీరోల్లో మంచి సక్సెస్ రేట్ తో దూసుకుపోతున్న నటుల్లో రాజ్ తరుణ్ కూడా ఒకరు. వరుస విజయాలతో నిర్మాతలకి మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారిపోయాడు రాజ్ తరుణ్. ప్రస్తుతం ఆయన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుతో ఒక సినిమా చేయనున్నారు. ‘అలా ఎలా’ ఫే,ఏ అనీష్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో ముందుగా మలయాళ నటి గాయత్రీ సురేష్ ను హీరోయిన్ గా అనుకున్నారు.

కానీ ఇప్పుడు ఆమె స్థానంలో పూణే అమ్మాయి రిద్ధి కుమార్ అనే కొత్త హీరోయిన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఇంతకు ముందు అనుకున్న గాయత్రి సురేష్ ను ఎందుకు పక్కబెట్టారో కారణాలు తెలియలేదు. ఇకపోతే రాజ్ తరుణ్ సంజన రెడ్డి డైరెక్షన్లో చేసిన ‘రాజుగాడు’ చిత్రం వచ్చే ఏడాది ఆరంభంలో రిలీజ్ కానుంది.