మాచో స్టార్ గోపిచంద్ హీరోగా తమిళ దర్శకుడు తిరు తెరకెక్కించిన స్పై థ్రిల్లర్ చాణక్య చిత్రం నిన్న గ్రాండ్ గా విడుదలైంది. ఏ కె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ బ్రహ్మం సుంకర నటించిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. నైజాంలో ఈ మూవీ మొదటిరోజు డీసెంట్ కలెక్షన్స్ సాధించింది. 66లక్షల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన చాణక్య 57లక్షల నెట్ కలెక్షన్స్ తో మొత్తంగా 27లక్షల డిస్ట్రిబ్యూటర్ షేర్ సాధించింది. నేడు ఆదివారం కావడంతో పాటు, దసరా పండుగ కూడా రెండు రోజులలో రానుండటంతో చాణక్య వసూళ్లు మెరుగయ్యే అవకాశం కలదు.
ఇక గోపీచంద్ మొదటిసారి అండర్ కవర్ రా ఏజెంట్ చేసిన చాణక్య చిత్రంలో హీరోయిన్ గా మెహ్రిన్ నటించారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో పంతం చిత్రం రావడం జరిగింది. జరీన్ ఖాన్ మరో హీరోయిన్ గా నటించగా సునీల్, అలీ, నాజర్, ఆదర్శ్, రాజా చెంబూరు ఇతర పాత్రలో కనిపించారు.


