సైరా విడుదల ఫై క్లారిటీ ఇచ్చిన చరణ్ !

Published on Jan 8, 2019 2:08 pm IST

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వచిత్రం ‘సైరా’ విడుదలపై క్లారిటీ ఇచ్చారు ఈ చిత్ర నిర్మాత స్టార్ హీరో రామ్ చరణ్. మరో రెండు నెలల్లో ఈ చిత్రం యొక్క షూటింగ్ పూర్తి కానుందని ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసి దసరా సీజన్ లో విడుదలచేయనున్నామని అన్నారు. అలాగే ఈ చిత్రం తరువాత కొరటాల శివ తో చిరు చేయనున్న చిత్రం ఈ సమ్మర్ లో మొదలు కానుందని ఆచిత్రం తరువాత దానయ్య డివివి నిర్మాణంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో చిరు నటించనున్న 153వ చిత్రం మొదలు అవుతుందని క్లారిటీ ఇచ్చాడు చరణ్.

ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ మరో మూడు రోజుల్లో ప్రేక్షకులముందుకు రానుంది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటరైనర్ గా తెరకెక్కిన ఈచిత్రంఫై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :

X
More