రామ్ చరణ్ బర్త్ డేకి ఉపాసన సూపర్బ్ గిఫ్ట్

రామ్ చరణ్ బర్త్ డేకి ఉపాసన సూపర్బ్ గిఫ్ట్

Published on Mar 21, 2013 1:45 PM IST

ramcharan-upasana

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే దగ్గర పడుతోంది. కానీ అప్పుడే రామ్ చరణ్ తన భార్య ఉపాసన నుంచి ఆశ్చర్యాన్ని కలిగించే ఓ అద్భుతమైన గిఫ్ట్ ని అందుకున్నాడు. ఉపాసన చరణ్ కోసం థాయ్ ల్యాండ్ నుంచి జాక్ రస్సెల్ పప్పీని తెప్పించి గిఫ్ట్ గా ఇచ్చింది. రామ్ చరణ్ – ఉపాసనలకి జంతువులు అంటే చాలా ఇష్టం. వీరు ఇదివరకే ఓ సారి వేరే దేశం నుంచి తెప్పించి ఒకరికొకరు బహుమతి గా ఇచ్చుకున్నారు.

రామ్ చరణ్ ప్రస్తుతం ‘జంజీర్’ , ‘ఎవడు’ సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాల కోసం తన టైంని కొద్ది రోజులు ముంబైకి కొద్ది రోజులు హైదరాబాద్ కి కేటాయించుకున్నాడు. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా హైదరాబాద్లో బర్త్ డే బాష్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే 27వ తేదీన చరణ్ లోకల్ లోనే ఉంటాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు