రామ్ చరణ్ నటనకు విశేష స్పందన !

రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు 1700 థియేటర్లలో విడుదలైంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి ఉదయం నుండే మంచి పాజిటివ్ టాక్ మొదలైంది. చాలా మంది ప్రేక్షకులు, అభిమానులు, విమర్శకులు, సెలబ్రిటీలు సినిమాలో చరణ్ నటన అద్భుతంగా ఉందని తెగ పొగిడేస్తున్నారు.

ఈ సినిమాతో చరణ్ లోని పూర్తి స్థాయి నటుడు బయటపడ్డాడని కూడ అంటున్నారు. అలాగే కథలో రంగమ్మత్త పాత్ర చేసిన అనసూయ, చరణ్ కు అన్నయ్యగా నటించిన ఆది పినిశెట్టి, కథానాయిక సమంతల పెర్ఫార్మెన్స్ కు కూడ మంచి ఫీడ్ బ్యాక్ లభిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.