“ఆచార్య”లో చరణ్ రోల్ పై ఆసక్తి పెంచుతున్న లుక్స్.!

Published on Jun 16, 2021 7:01 am IST

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రెండు భారీ మల్టీ స్టారర్ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి వాటిలో ఒకటి రాజమౌళితో చేస్తున్న “RRR” కాగా మరొకటి బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో తెరకెక్కిస్తున్న మెగా మల్టీ స్టారర్ “ఆచార్య” కూడా ఒకటి. అయితే ఈ చిత్రంలో చరణ్ సిద్ధ అనే పవర్ ఫుల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కొరటాల అదిరే అప్డేట్స్ ఇస్తూ కూడా చరణ్ కొత్త లుక్ రివీల్ చేశారు.

అయితే మొన్న చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో చిరుతో కలిసి ఓ లుక్ లో దర్శనం ఇచ్చిన చరణ్ యంగ్ లుక్ లో గడ్డంతో కనిపించాడు. అలాగే ఉగాది స్పెషల్ పోస్టర్ కానీ నిన్న చరణ్ తన దర్శకుడు కొరటాల శివకు విషెస్ చెబుతూ రివీల్ చేసిన ఆన్ లొకేషన్ స్టిల్ చూస్తే చరణ్ రోల్ కి కూడా ఏమన్నా ఫ్లాష్ బ్యాక్ ఉంటుందా అనిపిస్తుంది.

ఎందుకంటే వీటిలో చాలా హుందాగా మీసకట్టు, మెడలో రుద్రాక్ష వంటి నటితో సాలిడ్ లుక్ తో కనిపిస్తున్నాడు. కానీ మరో పక్క చిరుతో నక్సలైట్ గా కూడా దర్శనం ఇచ్చాడు. సో డిఫరెంట్ గా ఉన్న రెండు షేడ్స్ చూస్తే చరణ్ పాత్రకు రెండు స్టోరీస్ ఏమన్నా ఉండొచ్చేమో అనిపించక మానదు. దీనితో చిరు రోల్ తో పాటు చరణ్ రోల్ కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇందులో ఉంటుంది అనిపిస్తుంది. మరి కొరటాల చరణ్ ను ఎలా ప్రెజెంట్ చేయనున్నారో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :