ఉక్కు దేహంతో దర్శనం ఇచ్చిన మిస్టర్ బాక్సాఫీస్.!

Published on Apr 6, 2021 9:00 am IST

అభిమానులు ఎంతో ఇష్టంగా మిస్టర్ బాక్సాఫీస్ గా పిలవబడే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మన టాలీవుడ్ లో ఉన్న కొన్ని సాలిడ్ పర్సనాలిటీస్ లో ఒకరని తెలిసిందే. ధృవ సినిమా నుంచి తన హెవీ లుక్స్ తో ఆశ్చర్యపరుస్తూ వస్తున్న చరణ్ ఇప్పుడు తాను చేస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం”కు కూడా అంతకు మించిన స్థాయి ఫిజిక్ నే సెట్ చేసాడు.

రాజమౌళి ప్రెజెంట్ చేసిన సీతారామరాజుగా దృఢమైన దేహంతో కనిపించిన చరణ్ ఇప్పుడు తన హెవీ వర్క్ అవుట్ నుంచి ఓ ఫోటోను షేర్ చేసుకున్నాడు.కండలు తిరిగిన ఉక్కు దేహంతో కనిపించిన చరణ్ ఈ ఫొటోతో సోషల్ మీడియాలో యిట్టె వైరల్ అయ్యాడు. మరి ఇదంతా “RRR” కోసమే అని చెప్పాలి. ఇప్పటికే ఇందులో చరణ్ కనిపిస్తున్న డిఫరెంట్ షేడ్స్ కు సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. మొత్తానికి మాత్రం ఇప్పుడు బయటకొచ్చిన చరణ్ ఫోటో మెగా ఫ్యాన్స్ లో మంచి వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :