తన 12వ చిత్రంలో పవర్ ఫుల్ పాత్రలో చరణ్ ?

Published on Aug 17, 2018 7:25 pm IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 12వ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. మాస్ చిత్రాల దర్శకుడు బోయ పాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో చరణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడని సమాచారం. ఆయన ఇంతకుముందు ‘తుఫాన్, ధృవ’ చిత్రాలలో పోలీస్ పాత్రలో నటించాడు. ఇక బోయపాటి ఈచిత్రాన్ని తన స్టయిల్లో తెరకెక్కిస్తున్నాడట. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో చరణ్ పూర్తిగా కొత్తగా కనిపించనున్నారట.

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈచిత్రంలో కైరా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. డి వి వి ఎంటర్ టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య డి వి వి నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :

X
More