ఎన్టీఆర్ కి చరణ్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడట.!

ఎన్టీఆర్ కి చరణ్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడట.!

Published on May 20, 2020 1:37 PM IST

వరల్డ్ వైడ్ గా ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ పుట్టిన రోజు సెలెబ్రేషన్స్ లో మునిగిపోయారు. లాక్ డౌన్ కారణంగా ఫిజికల్ గా బయటికి రాకున్నా వారు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. ఇక టాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా ఎన్టీఆర్ కి బర్త్ డే విశేష్ చెవుతూ తారక్ తో గల అనుబంధాన్ని పంచుకుంటున్నారు. కాగా హీరో రామ్ చరణ్ ఎన్టీఆర్ కి ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ‘ హ్యాపీ బర్త్ డే మై డియర్ బ్రదర్ తారక్. నేను నీకు తిరిగి చెల్లించుకోవాల్సిన బహుమతి ఒకటి ఉంది. అది అద్భుతంగా ఉంటుంది. పండుగ సమయం ముందుంది’ అని చరణ్ ట్వీట్ చేయడంతో పాటు ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని ఓ వర్కింగ్ స్టిల్ పంచుకున్నారు.

ఎన్టీఆర్, చరణ్ వైట్ అండ్ వైట్ లో ఉన్న ఆ ఫోటో చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఆర్ ఆర్ ఆర్ నుండి చరణ్ పుట్టిన రోజు కానుకగా భీమ్ ఫర్ రామరాజు పేరుతో ఫస్ట్ లుక్ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో చరణ్ పాత్ర హీరోయిజం ఎలివేట్ చేస్తూ సాగిన ఆ వీడియో చరణ్ మరియు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మంచి అనుభూతిని పంచింది. ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా నేడు ఆయన ఫస్ట్ లుక్ విడుదల కావాల్సివుండగా కొన్ని అనివార్య కారణాల వలన విడుదల కాలేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు