చరణ్ యాక్షన్ ఆ సాలిడ్ పర్సనాలిటీ తోనే అట.!

Published on Apr 16, 2021 1:00 pm IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు రెండు భారీ చిత్రాల్లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. రాజమౌళి, తారక్ తో “RRR”, బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో మెగా మల్టీ స్టారర్ “ఆచార్య” షూట్ లలో ఏకకాలంలో నటిస్తున్నాడు. అయితే ఇప్పుడు చరణ్ ఆచార్య షూట్ లో అది కూడా ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

కొరటాల తన మార్క్ లో రైన్ ఫైట్ సీన్ ను ఈ చిత్రంలో ఇపుడు చరణ్ పై తీస్తున్నారని తెలుస్తుంది. మరి ఈ ఈ ఫైట్ కు గాను చరణ్ తో పాటుగా సాలిడ్ పర్సనాలిటీ సోనూ సూద్ కూడా పాల్గొననున్నట్టు తెలుస్తుంది. మొన్నటి నుంచే సోనూ సూద్ కూడా ఈ చిత్రం షూట్ లో పాల్గొన్నాడు.

మరి ఇప్పుడు వీరిద్దరిపైనే కొరటాల సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ ను డిజైన్ చేయించినట్టు తెలుస్తుంది. మరి ఈ మాస్ ఫీస్ట్ ఏ లెవెల్లో ఉండనుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన కాజల్, చరణ్ సరసన పూజా హెగ్డేలు నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :