నవంబర్ నుండి రామ్ చరణ్ – శ్రీను వైట్ల సినిమా..!

ram-charan-srinu-vaitla
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ‘నాయక్’ వంటి భారి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించిన డివివి దానయ్య మరో సూపర్ హిట్ సినిమా ప్రేక్షకులకు అందించడానికి సిద్దం అయ్యారు. కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాల దర్శకుడు శ్రీను వైట్ల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమా షూటింగ్ నవంబర్ నెలలో ప్రారంభం కానుంది.

చరణ్, శ్రీను వైట్ల కాంబినేషన్లో వస్తున్న తోలి సినిమా కావడంతో మెగా అభిమానులలో భారి అంచనాలు ఏర్పడ్డాయి. వాటికి తగ్గట్టు దర్శకుడు అద్బుతమైన స్క్రిప్ట్ తయారుచేశారు. ప్రముఖ నటీనటులతో పాటు అత్యుత్తమ టెక్నిషియన్స్ ఈ సినిమాకు పని చేయనున్నారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతం చరణ్ కృష్ణవంశి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలి ఎంటర్టైనర్ ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలో నటిస్తున్నాడు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు.

Exit mobile version