
‘గోవిందుడు అందరివాడెలే’ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ప్రేక్షకులు కోరుకునే యాక్షన్ అంశాలకి కామెడీని పర్ఫెక్ట్ గా మిక్స్ చేసి చెప్పగల శ్రీనువైట్ల ఈ సినిమాకి డైరెక్టర్. గత వారం వరకూ ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ నగర శివార్లలో జరిగింది. శంషాబాద్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న తర్వాత ఈ చిత్ర టీం ఒక వారం రోజులు గ్యాప్ తీసుకున్నారు. రేపటి నుంచి మళ్ళీ ఈ చిత్ర టీం కొత్త షెడ్యూల్ ని హైదరాబాద్ లో మొదలు పెట్టనుంది. రామ్ చరణ్ కూడా రేపటి నుంచ షూట్ లో జాయిన్ అవుతాడు.
రామ్ చరణ్ తో పాటు సినిమాని ప్రధాన నటులపై ముఖ్య సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ఇప్పటి వరకూ షూట్ చేసిన కంటెంట్ విషయంలో రామ్ చరణ్ ఎంతో హ్యాపీగా ఉన్నాడు. రామ్ చరణ్ ఇది వరకూ ట్రై చెయ్యని కామెడీ యాంగిల్ ఇందులో ట్రై చేస్తున్నాడు. అందుకే కామెడీ టైమింగ్ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నాడు. రామ్ చరణ్ స్టంట్ మాస్టర్ గా కనిపించనున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపిస్తోంది. నదియా ముఖ్య పాత్ర పోషిస్తుండగా, కృతి కర్భంద రామ్ చరణ్ చెల్లెలిగా కనిపించనుంది. కోన వెంకట్ – గోపి మోహన్ కలిసి కథని అందించిన ఈ సినిమాని డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. ఇప్పటికే 2 సాంగ్స్ షూటింగ్ ఫినిష్ చేసిన ఈ మూవీకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.