ఫ్యాన్స్ కి చరణ్ విన్నపం..!

Published on Mar 18, 2020 10:25 am IST

రామ్ చరణ్ తన అభిమానులకు ఓ విన్నపాన్ని లేఖ ద్వారా విన్నవించారు. ఈనెల 27న తన పుట్టిన రోజు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎలాంటి వేడుకలు నిర్వహించరాదని ఆదేశించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో భాగంగా ఆయన ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. జనసాంద్రత ఎక్కువగా ఉండడం కరోనా వైరస్ వ్యాప్తికి కారణంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఫ్యాన్స్ గుంపులుగా చేరి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించరాదని ఆయన కోరారు. తన పుట్టిన రోజు నిర్వహించకపోవడమే ఫ్యాన్స్ తనకు ఇచ్చే అతిపెద్ద గిఫ్ట్ అని ఆయన చెప్పుకొచ్చారు.

ఇప్పటికే టాలీవుడ్ నుండి కొత్త చిత్రాల విడుదల నిలిపివేయడంతో పాటు, షూటింగ్స్ కి బ్రేక్ ఇవ్వడం జరిగింది. ఇక ప్రముఖ హీరోలు సైతం తమ జన్మదిన వేడుకలను నిర్వహించకూడని నిర్ణయించుకుంటున్నారు. మోహన్ బాబు సైతం తన పుట్టిన రోజు వేడుకలను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More