చరణ్ ముందు ఈ సినిమానే టేక్ చెయ్యనున్నాడా.?

Published on Jan 13, 2021 6:00 pm IST

లేటెస్ట్ గానే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కోవిడ్ వైరస్ నుంచి బయటపడ్డ సంగతి తెలిసిందే. ఇక ఆ వార్త చెప్పడంతోనే తాను మళ్ళీ తన వర్క్ లో బిజీగా అవుతానని కన్ఫర్మ్ చేసేసారు. ఇక ఇక్కడ నుంచి చరణ్ చేస్తున్న రెండు భారీ ప్రాజెక్టులు కూడా మరింత వేగంగా మొదలు కానున్నాయి.

అయితే ఇప్పుడు చరణ్ “రౌద్రం రణం రుధిరం” మరియు “ఆచార్య” షూట్ లలో బ్యాలన్స్ పూర్తి చెయ్యాల్సి ఉంది. మరి ఈ రెండిట్లో చరణ్ ఏది ముందు మొదలు పెట్టనున్నాడో అన్నది తెలుస్తుంది. ఈ రెండిట్లో చరణ్ మొదటగా ఆచార్య షూట్ లోనే పాల్గొననున్నట్టు తెలుస్తుంది.

అలాగే ఈ జనవరిలోనే ఈ షూట్ మొదలు కానుందట. మెగాస్టార్ మరియు కొరటాల కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More