దెయ్యంతో రాత్రంతా గడిపిన చార్మీ

దెయ్యంతో రాత్రంతా గడిపిన చార్మీ

Published on Feb 22, 2015 3:03 PM IST

charmi
అందాల భామ ఛార్మీ ఏంటి, రాత్రంతా దెయ్యంతో గడపడం ఏంటి.? అని షాక్ అవ్వకండి.. మీరు విన్నది నిజమే ఓ దెయ్యంతో రాత్రంతా గడిపింది కానీ అది నిజం దెయ్యం కాదు తన సినిమాలో నటిస్తున్న ఓ దెయ్యంతో కలిసి ఉంది. కెరీర్ మొదట్లో చార్మింగ్ బ్యూటీ చార్మీ చేసిన గ్లామరస్ రోల్స్ ఎంత పేరు తీసుకొచ్చాయో, అంతకు మించి గుర్తింపు తెచ్చిన మూవీ ‘మంత్ర’. దానికి కొనసాగింపుగా మరో హర్రర్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ‘మంత్ర 2’ సినిమాలో కూడా చార్మీ లీడ్ రోల్ చేస్తోంది. గత సంవత్సరం లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.. నిన్నటి నుంచి ఈ సినిమాకి సంబందించిన క్లైమాక్స్ ఎపిసోడ్ ని హైదరబాద్ నగరశివార్లలో నైట్ ఎఫెక్ట్ లో షూట్ చేస్తున్నారు.

‘మంత్ర 2 కోసం నైట్ షూటింగ్, ఫినిష్ చెయ్యాల్సిన సీన్స్ చాలా ఉన్నాయి. నైట్ ఎఫెక్ట్ లో ఫుల్ చలిలో వర్షంలో వచ్చే కొన్ని షాట్స్ తీస్తున్నాం. చీకట్లో అంతా సైలెంట్ గా ఉంది. కానీ నేను ఒక్క దాన్నే లేను నాకు తోడుగా ఓ దెయ్యం ఉందని’ ఛార్మీ ట్విట్టర్ లో షేర్ చేసింది. ‘మంత్ర’ సినిమాని మించి ‘మంత్ర 2’ ఉంటుందని అంటున్న ఈ సినిమా ద్వారా కెవి సతీష్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. బోనాల శ్రీకాంత్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు