
అన్ని డిపార్ట్ మెంట్స్ లోనూ చేయితిరిగిన యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగానే కాకుండా తన సినిమాలకు కథ – కథనాలను కూడా అందిస్తుంటాడు. అలా కమల్ హాసన్ కథ – కథనం అందించి తన అసిస్టెంట్ రాజేష్.ఎమ్. సెల్వ దర్శకుడిగా పరిచయం చేస్తూ చేసిన సినిమా ‘చీకటి రాజ్యం’. తమిళంలో ‘తూంగావనం’ అనే పేరుతో రిలీజ్ కానుంది. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ రోజు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కమల్ హాసన్ ఈ సినిమాని నవంబర్లో దీపావళి కానుకగా ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయనున్నామని, త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని తెలిపారు.
ఒకే ఒక్క రోజు రాత్రి ఏం జరిగింది అనే అంశం చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ట్రైలర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే కమల్ హాసన్ తన పార్ట్ కి సంబందించిన డబ్బంగ్ వర్క్ ని ఫినిష్ చేసాడు. ఈ సినిమాలో ఒక రెస్టారెంట్‌లోని కిచెన్‌లో త్రిష, కమల్‌ల మధ్య వచ్చే ఫైట్ సీక్వెన్స్ చాలా ఆసక్తికరంగా ఉంటుందని సమాచారం. ఇక ప్రకాష్ రాజ్, సంపత్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు జిబ్రాన్ మ్యూజిక్ అందించాడు. త్వరలోనే ఆడియోని కూడా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

