ఒకే పాట, ఫాస్ట్ స్క్రీన్ ప్లేతో రానున్న కమల్ ‘చీకటి రాజ్యం’

ఒకే పాట, ఫాస్ట్ స్క్రీన్ ప్లేతో రానున్న కమల్ ‘చీకటి రాజ్యం’

Published on Oct 23, 2015 4:58 PM IST

cheekati-rajyam

అన్ని డిపార్ట్ మెంట్స్ లోనూ మంచి పట్టు ఉన్న యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగానే కాకుండా తన సినిమాలకు కథ – కథనాలను కూడా అందిస్తుంటాడు. అలా కమల్ హాసన్ కథ – కథనం అందించి తన అసిస్టెంట్ రాజేష్.ఎమ్. సెల్వ దర్శకుడిగా పరిచయం చేస్తూ చేసిన సినిమా ‘చీకటి రాజ్యం’. తమిళంలో ‘తూంగావనం’ అనే పేరుతో రిలీజ్ కానుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసిన ఈ సినిమాని దీపావళి కానుకగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హాలీవుడ్ మూవీ ‘స్లీప్ లెస్ నైట్’ సినిమాకి స్పూర్తిగా వస్తున్న ఈ సినిమా కూడా హాలీవుడ్ స్టైల్ లోనే ఉంటుందట.

తాజాగా ఈ చిత్ర టీం నుంచి ఈ సినిమాకి సంబందించిన ఆసక్తికర విషయాలు తెలిసాయి.. చీకటి రాజ్యంలో ఒకే ఒక్క సాంగ్ ఉంటుంది, అది కూడా సందర్భానుసారంగా వచ్చేదే. అది కాకుండా ఈ సినిమా రన్ టైం కేవలం 127నిమిషాలు మాత్రమే. మామూలుగా కమల్ సినిమాలు అనగానే రన్ టైం చాలా ఎక్కువగా ఉంటుంది. కమల్ చివరి సినిమా ఉత్తమ విలన్ కి కూడా రన్ టైం చాలా ఎక్కువైంది. అందుకే చీకటి రాజ్యం ని షార్ట్ టైం ఉండేలా ప్లాన్ చేసుకోవడమే కాకుండా స్పీడ్ స్క్రీన్ ప్లేతో ఆకట్టుకోనున్నారు. ఈ సినిమాలో ఒక రెస్టారెంట్‌లోని కిచెన్‌లో త్రిష, కమల్‌ల మధ్య వచ్చే ఫైట్ సీక్వెన్స్ చాలా ఆసక్తికరంగా ఉంటుందని సమాచారం. ఇక ప్రకాష్ రాజ్, సంపత్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు జిబ్రాన్ మ్యూజిక్ అందించాడు.

తాజా వార్తలు