గ్లోబల్ ట్రెండ్స్ లో ‘రాకాస’.. మిలియన్స్ వ్యూస్ తో ఓటిటిలో అదరగొడుతున్న ఫాంటసీ కామెడీ

గ్లోబల్ ట్రెండ్స్ లో ‘రాకాస’.. మిలియన్స్ వ్యూస్ తో ఓటిటిలో అదరగొడుతున్న ఫాంటసీ కామెడీ

Published on May 10, 2026 10:30 PM IST

రీసెంట్ గా టాలీవుడ్ నుంచి వచ్చిన హారర్ ఫాంటసీ కామెడీ చిత్రమే ‘రాకాస’. యువ హీరో సంగీత్ శోభన్ హీరోగా నయన్ సారిక హీరోయిన్ గా దర్శకురాలు మానస శర్మ తెరకెక్కించిన ఈ సినిమాకు థియేటర్లో అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఓటీటీలోనూ ఈ చిత్రం దూసుకుపోతోంది. నెట్ ఫ్లిక్స్ గ్లోబల్ చార్ట్‌లో టాప్ 7కి ‘రాకాస’ చేరుకుంది. ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు 1.2 మిలియన్ వ్యూస్‌తో ఏడో స్థానంలో ట్రెండ్ అవుతూ ఉందని నెట్ ఫ్లిక్స్ సంస్థ ప్రకటించింది.

ఈ ఘనతతో ఈ వారం నెట్ ఫ్లిక్స్‌పై ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన ఆంగ్లేతర చిత్రాల జాబితాలో ‘రాకాస’ పలు అంతర్జాతీయ మార్కెట్ల చిత్రాల సరసన నిలిచింది. థియేటర్లలో ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ కంటే డిజిటల్ స్ట్రీమింగ్‌లో మరింత ఆదరణ లభిస్తోందని ఈ లెక్కలే చెబుతున్నాయి. థియేటర్లలో నెమ్మదిగా మౌత్ టాక్‌తో దూసుకుపోయిన ఈ సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్లియర్ రెస్పాన్స్‌ పొందినట్టుగా దూసుకుపోతోంది. థియేటర్లలోనే ఈ మూవీని అందరూ ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేశారు. ఇక ఇప్పుడు అదే ఆదరణ ఓటీటీలోనూ కనిపిస్తోంది.

నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ టాప్ 10లో ‘రాకాస’ ఎంట్రీని గమనిస్తే.. తెలుగు సినిమాకు పెరుగుతున్న అంతర్జాతీయ గుర్తింపును మరింతగా నొక్కి చెబుతున్నట్టుగా అనిపిస్తుంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై, జీ స్టూడియోస్ సహకారంతో నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సల్ నిర్మించిన ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ‘రాకాస’ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండ్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు