
కమల్ హాసన్ నటించిన చీకటి రాజ్యం సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుపుకుంటున్న విషయం తెలిసినదే. తాజా సమాచారం ప్రకారం
ఈ చిత్రం ఫ్రెంచ్ చిత్రం నుండి స్పూర్తి పొందినట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కమల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు.
ఒక రాత్రిలో సినిమా మొత్తం సాగిపోయే నేపధ్యంలో చిత్రీకరణ జరుపుకుంటుంది.
ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, సత్యరాజ్ ముఖ్యపాత్రలు పోషించారు. త్రిష హీరోయిన్. మధుశాలిని ముఖ్యపాత్ర పోషించింది. రాజేష్ దర్శకత్వం వహిస్తున్నాడు.