
ప్రయోగాలకు పెట్టింది పేరైన నటుడు కమల్ హాసన్ తాజాగా చేస్తోన్న మరో ప్రయోగమే ‘చీకటి రాజ్యం’. ఒకే ఒక్కరాత్రి జరిగే సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని దీపావళి కానుకగా విడుదలకు సిద్ధమైంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ సినిమా తమిళంలో ‘తూంగవనం’ పేరుతో తెరకెక్కింది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ విషయమై మొదట్లో కొంత అయోమయం ఉండగా తాజాగా కమల్ హాసన్ రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చేశారు.
దీపావళి రేస్ నుంచి సినిమా తప్పుకుందనే వార్తలు వినిపించిన నేపథ్యంలో కమల్ తాజాగా ఇచ్చిన క్లారిటీతో అంతా క్లియర్ అయిపోయింది. నవంబర్ 10న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు కమల్ టీమ్ ప్లాన్ చేస్తోంది. కేవలం రెండు గంటల 7 నిమిషాల నిడివి గల ఈ సినిమా సూపర్ ఫాస్ట్ స్క్రీన్‌ప్లేతో మెప్పించనుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్స్ ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఏర్పరచాయి. కమల్‌తో పాటు త్రిష, ప్రకాష్ రాజ్, సంపత్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఆరు రోజుల హాలిడే వీకెంట్ బాకా కలిసివచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.

