త్వరలోనే కమల్ ‘చీకటి రాజ్యం’ ట్రైలర్ రిలీజ్!

త్వరలోనే కమల్ ‘చీకటి రాజ్యం’ ట్రైలర్ రిలీజ్!

Published on Aug 26, 2015 7:45 PM IST

Kamal-Cheekati-Rajyam
ప్రయోగాలకు పెట్టింది పేరైన నటుడు కమల్ హాసన్ తాజాగా చేస్తోన్న మరో ప్రయోగమే ‘చీకటి రాజ్యం’. ఒకే ఒక్కరాత్రి జరిగే సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది. ఇక నటుడిగానే కాక, రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా కూడా తానేంటో నిరూపించుకున్న కమల్, ఈ సినిమాకు కథ-కథనాలను అందించడంతో పాటు స్వయంగా నిర్మించారు. గతంలో కమల్ హీరోగా రూపొందిన పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన రాజేష్.ఎమ్.సెల్వ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

తెలుగు, తమిళంలో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమా కేవలం 40 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ‘ఉత్తమ విలన్’తో తన సినిమాలకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం ప్రారంభించిన కమల్, ఈ సినిమాకు సొంతంగా డబ్బింగ్ చెబుతున్నారు. అలాగే ఈ సినిమా ట్రైలర్ కోసం కూడా దర్శకుడు అప్పుడే పనులు మొదలుపెట్టేశారట. త్వరలోనే చీకటి రాజ్యం ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు సినిమా యూనిట్ తెలిపింది. ఇక ప్రకాష్ రాజ్, సంపత్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా తమిళంళో ‘తూంగవనం’ పేరుతో రూపొందింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు