‘చెన్నై లవ్ స్టోరీ’ మూడు రోజుల వసూళ్లు.. ఎంతంటే..?

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా ‘చెన్నై లవ్ స్టోరీ’ థియేటర్లలో పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. సాయి రాజేష్ అందించిన కథను నూతన దర్శకుడు రవి నంబూరి తెరకెక్కించిన తీరుకు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం తొలి వీకెండ్‌లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.40.1 కోట్ల గ్రాస్ వసూలు చేసి, కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్‌ సాధించిన చిత్రంగా నిలిచింది. సినిమాలో హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ పర్ఫార్మెన్స్ స్టెషల్ అట్రాక్షన్‌గా నిలవగా, ఇటీవల చిత్రబృందం ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకుంది.

ఇక సోమవారం కూడా మంచి ఆక్యుపెన్సీ కొనసాగుతుండటంతో, మరో రెండు రోజుల్లో ఈ సినిమా రూ.50 కోట్ల మార్క్‌ను దాటేయడం ఖాయమని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. సాయి రాజేష్, ఎస్‌కేఎన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ అందించిన సంగీతం మేజర్ అసెట్‌గా నిలిచింది.

Exit mobile version