బాబాయ్ ఆఫర్ తో థ్రిల్ అయిన అబ్బాయ్

బాబాయ్ ఆఫర్ తో థ్రిల్ అయిన అబ్బాయ్

Published on Mar 1, 2015 8:51 PM IST

pawan-ram-charan

త్వరలోనే టాలీవుడ్ లో ఓ క్రేజీ కాంబినేషన్ లో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అదే మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్మాతగా రామ్ చరణ్ హీరోగా చేయనున్న సినిమా..నిన్న ఈ వార్తని పవన్ కళ్యాణ్ ఆఫీసు రిలీజ్ చెయ్యగానే అందరూ థ్రిల్ అయ్యారు. ఈ వార్త మెగా అభిమానులనే కాకుండా రామ్ చరణ్ ని కూడా ఎంతో థ్రిల్ చేసింది.

ఈ వార్తపై రామ్ చరణ్ స్పందిస్తూ ‘అవును మీరు విన్నది నిజమే.. కళ్యాణ్ బాబాయ్ తన ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తుండడం చాలా హ్యాపీగా ఉంది. దానికంటే బాబాయ్ మొదటి ప్రాజెక్ట్ లో నేను భాగస్వామి అవ్వడం ఎంతో ఎగ్జైటింగ్ గా, ఎమోషనల్ గాను ఉంది.లవ్ యు బాబాయ్’ అని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసాడు. రామ్ చరణ్ కూడా ఈ సినిమాని మరోసారి ఖరారు చేస్తూ, తన ఆనందాన్ని వ్యక్తం చేయడంతో మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. త్వరలోనే రామ్ చరణ్ శ్రీనువైట్ల దర్శకత్వంలో చేయనున్న సినిమాని మొదలు పెట్టనున్నాడు. త్వరలోనే పవన్ కళ్యాణ్ – రామ్ చరణ్ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలను తెలియజేయనున్నారు.

తాజా వార్తలు