‘ఛావా’ ఎఫెక్ట్.. గుప్తనిధుల ఎగబడ్డ జనం!

chhava 1

బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఛావా’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితకథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో కథ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాలో చరిత్రకు సంబంధించి చాలా విషయాలను వెల్లడించారు.

అయితే, ఇప్పుడు ఈ సినిమా ఎఫెక్ట్‌తో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. మొగల్ కాలంలో మధ్యప్రదేశ్ లోని అసిర్‌ఘడ్ కోట సమీపంలో బంగారు నాణేలు దాచి పెట్టినట్లుగా ఈ సినిమాలో తెలిపారు. దీంతో మధ్యప్రదేశ్ బుర్హన్‌పూర్ గ్రామస్థులు అసిర్‌ఘడ్ కోట సమీపంలో గుప్త నిధులు ఉన్నాయంటూ తవ్వకాలు చేపట్టారు.

గ్రామస్థులందరూ ఇలా బంగారం కోసం తవ్వకాలు చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ విషయం గురించి తెలుసుకున్న పోలీసులు కొందరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్ట్ చేసిన ‘ఛావా’ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది.

Exit mobile version