పాండిరాజ్ దర్శకత్వంలో తమిళ హీరో కార్తీ , సయేషా జంటగా తమిళ భాషలో నటించిన చిత్రం ‘కడైకుట్టి సింగం’. ఇక ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ పతాకం ఫై మిర్యాల రవీందర్ రెడ్డి ‘చినబాబు’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. తాజాగా కొద్దీ నిమిషాల క్రితం ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కార్తీ మాస్ లుక్ లో అలరించనున్నాడు. ఇమ్మాన్ ఈ చిత్రానికి సంగీతం అందిచాడు.
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రానున్న ఈ చిత్రంలో సత్యరాజ్ ముఖ్య పాత్రలో నటించారు. తమిళ్ లో కార్తీ అన్నయ్య హీరో సూర్య నే ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం . ఈనెల 13 న ఈ చిత్రం తెలుగు , తమిళ భాషలలో ఒకేసారి విడుదలకానుంది.
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


