మాస్ రాజా ఆడియో లాంచ్ కి అతిధిగా యంగ్ టైగర్

మాస్ రాజా ఆడియో లాంచ్ కి అతిధిగా యంగ్ టైగర్

Published on May 6, 2015 7:00 PM IST

Kick2
ఒక హీరోగా, నిర్మాతగా ‘పటాస్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్. మొదటిసారిగా కళ్యాణ్ రామ్ తన ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై బయటి హీరోతో చేస్తున్న సినిమా ‘కిక్ 2’. మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ‘కిక్’ సినిమాకి సీక్వెల్. రవితేజ ఎనర్జీకి తగ్గట్టుగా, అంతే ఎంటర్టైన్మెంట్ తో మరోసారి ప్రేక్షకులను చేసిన ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ఎస్ఎస్ తమన్ అందించిన మ్యూజిక్ అందించిన ఈ మూవీ ఆడియో ఆల్బమ్ ని మే 9న రిలీజ్ చేయనున్నారనే విషయాన్ని ఇది వరకే తెలియజేశాం.

తాజా సమాచారం ప్రకారం కిక్ 2 సినిమా ఆడియో లాంచ్ కి ముఖ్య అతిధిగా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హాజరు కానున్నాడని సమాచారం. ఎన్.టి.ఆర్ కి అన్న అయిన కళ్యాణ్ రామ్ ఈ సినిమాని నిర్మిస్తుండడం వలన సినిమా ప్రమోషన్స్ లో తన వంతు సాయం చేస్తున్నాడు. కిక్ సినిమాకి కొనసాగింపుగా ఆ పార్ట్ లోని రవితేజ – ఇలియానాల వారసుడి కథని ఆధారం చేసుకొనిఈ సినిమాలో రవితేజ ఇందులో ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడు. రవితేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి సురేందర్ రెడ్డి డైరెక్టర్.

ఇదిలా ఉంటే ఈ రోజు సాయంత్రం జరగనున్న స్వర్గీయ నందమూరి జానకిరామ్ తనయుడు మాస్టర్ ఎన్.టి.ఆర్ నటించిన ‘దాన వీర శూర కర్ణ’ ఆడియోకి కూడా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, నందమూరి కళ్యాణ్ రామ్ ముఖ్య అతిధులుగా హాజరు కానున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు