యూత్ ని టార్గెట్ చేస్తోన్న ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’.

Published on Feb 2, 2019 8:11 pm IST

యూత్ ని టార్గెట్ చేస్తూ.. సంతోష్ పి జయకుమార్ దర్శకత్వంలో ఆదిత్ – నిక్కీ ప్రధాన పాత్రల్లో రాబోతున్న చిత్రం ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’. యూత్ మైండ్ సెట్‌ని దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ తాజాగా విడుదల అయింది. ట్రైలర్ లో బూతు అంశాలు తారాస్థాయిలో ఉన్నాయని పేరు వచ్చినా.. ట్రైలర్ కు మాత్రం అనూహ్య స్పందన వస్తోంది. మొత్తానికి డబుల్ మీనింగ్ కాదు, డైరెక్ట్ మీనింగే అన్నట్లు సాగిన ఈ ట్రైలర్ యూత్ ని బాగానే ఆకట్టుకుంటూ ట్రెండింగ్ అవుతుంది.

అయితే ట్రైలరే ఇంత బోల్డ్‌గా ఉంటే.. ఇక సినిమా ఏ స్థాయిలో ఏ విధంగా ఉంటుందోనని నెటిజన్లు సినిమా పై బాగానే చర్చించుకుంటున్నారు. మరీ మోతాదు మించిన ఘాటు సీన్లతో.. పైగా ‘చీకటి గదిలో చితకొట్టుడు’ అనే ఉరమాస్ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాకు యూత్ లో అంచనాలు భారీగా పెరిగాయి. మరి పక్కా అడల్ట్ హర్రర్ కామెడీ మూవీగా వస్తోన్న ఈ సినిమా వారి అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.

బాలమురళి బాలు ఈ సినిమాకి సంగీతమందిస్తుండగా బ్లూఘోస్ట్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

సంబంధిత సమాచారం :