ఇంటర్నేషనల్ కాఫీ బ్రాండ్ అంబాసిడర్ గా స్టార్ హీరోల చైల్డ్ వెర్షన్.!

ఇంటర్నేషనల్ కాఫీ బ్రాండ్ అంబాసిడర్ గా స్టార్ హీరోల చైల్డ్ వెర్షన్.!

Published on May 20, 2020 1:30 AM IST

ప్రస్తుత మన స్టార్ హీరోలకు చైల్డ్ వెర్షన్ హీరో అంటే అప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ తేజ గుర్తొచ్చేవాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో చిత్రాల్లో రాణించి ఇప్పుడు హీరో అయ్యాడు తేజ. ‘‘ఓ బేబి” మూవీలో నటించి మంచి మార్కులు కొట్టేసాడు.తన క్యూట్ లుక్స్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న తేజ ఇప్పుడు ఇంటర్నేషనల్ బ్రాండ్ అయిన ‘‘కాంటినెంటల్ కాఫీ” తో అసోసియేట్ అయ్యి ఆశ్చర్యపరిచాడు.మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ బ్రాండ్ ను ప్రమోట్ చేయనున్నాడు.

ఇటీవలే ఈ బ్రాండ్ కు సంబంధించి ఓ ఫొటో షూట్ కూడా చేసి రెండు పోస్టర్స్ ను మరియు ఓ ప్రమోషనల్ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ..ఈ “కాంటినెంటల్ కాఫీ” తో అసోసియేట్ అవ్వడం హ్యపీగా ఉందని తెలిపాడు.ఈ లాక్ డౌన్ లో ఇంట్లో ఉంటూ కాంటినెంటల్ కాఫీ తాగి రిలాక్స్ అవ్వండి అని అంటున్నాడు.ఎదిగిన తర్వాత ఇంకా పూర్తి స్థాయి హీరోగా మారక మునుపే ఇలాంటి అంతర్జాతీయ బ్రాండ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారడం విశేషమే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు