‘చినబాబు’ అక్కడ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు !

Published on Jul 30, 2018 11:31 am IST

తమిళ హీరో కార్తీ , సయేషా జంటగా పాండిరాజ్ దర్శకత్వంలో తమిళ భాషలో తెరకెక్కిన చిత్రం ‘కడైకుట్టి సింగం’. ఈనెల 13 న తెలుగు , తమిళ భాషలలో ఒకేసారి ప్రేక్షకులముందుకు వచ్చిన ఈచిత్రం తమిళ భాషలో మూడు వారాలకుగాను రూ . 40కోట్ల గ్రాస్ ను రాబట్టి బ్లాక్ బ్లస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. కార్తీ కెరీర్ లో ఇవే అత్యధిక కలెక్షన్స్ కావడం విశేషం. ఈ చిత్రాన్ని కార్తీ అన్నయ్య స్టార్ హీరో సూర్య 2డి ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై నిర్మించారు.

ఇక ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ పతాకం ఫై మిర్యాల రవీందర్ రెడ్డి ‘చినబాబు’ పేరుతో తెలుగులో విడుదలచేశారు. అయితే తమిళ నేటివిటీ ఎక్కువగా ఉండడంతో ఈ సినిమాపై మన ప్రేక్షకులు అంతగా ఆసక్తిని చూపించకపలేకపోయారు. దాంతో ఈచిత్రం ఇక్కడ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇమ్మాన్ సంగీతం అందించిన ఈ సినిమాలో కార్తీ రైతుల పాత్రలో నటించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో సత్యరాజ్ ముఖ్య పాత్రలో నటించారు.

సంబంధిత సమాచారం :