#Mega154 సెట్స్: చిరుతో బాబీ డీప్ డిస్కషన్..!

#Mega154 సెట్స్: చిరుతో బాబీ డీప్ డిస్కషన్..!

Published on Dec 2, 2021 10:55 PM IST


మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకున్న చిరు ప్రస్తుతం గాడ్ఫాదర్, భోళా శంకర్ సినిమాల షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే బాబీతో కూడా చిరు ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. #Mega154 వర్కింగ్ టైటిల్తో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే విడుదలై సినిమాపై మంచి హైప్‌ని తీసుకొచ్చింది.

అయితే తాజాగా ఈ సినిమా సెట్స్‌లో దర్శకుడు బాబీ చిరంజీవితో ఏదో చర్చిస్తున్నట్టుగా ఉన్న ఫోటో బయటకొచ్చింది. మాస్‌ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చిరు ఓ జాలరిగా మాస్‌ గెటప్‌లో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు