సినిమా ఐతే కావచ్చు, పేరెంట్స్ కదా ఏడ్చేశారు

సినిమా ఐతే కావచ్చు, పేరెంట్స్ కదా ఏడ్చేశారు

Published on Oct 1, 2019 10:47 PM IST

rrr

ఇటీవల ఆర్ ఆర్ ఆర్ సెట్స్ లో జరిగిన ఓ సంఘటన చిరు దంపతులను కంటనీరు పెట్టించిందట. రామ్ చరణ్ ని కఠిన పరిస్థితిలో చూసిన చిరంజీవి, సురేఖ కన్నీరు ఆపుకోలేకపోయారట. విషయంలోకి వెళితే ఆర్ ఆర్ ఆర్ మూవీ షూటింగ్ లో భాగంగా రామ్ చరణ్ పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తూ ఉండగా ఆ సమయంలో చిరు దంపతులు అక్కడికి వెళ్లారట. అల్లూరి గెటప్ లో ఉన్న చరణ్ ని తాళ్లతో కట్టి ఈడ్చుకెళుతున్నారట. సహజత్వం కోసం కొంచెం కఠినంగానే ఆ సన్నివేశం తెరకెక్కిస్తున్నారట రాజమౌళి. అది చూసిన చిరు దంపతులు భావోద్వేగం ఆపుకోలేకపోయారట.

సైరా ప్రొమోషన్స్ లో భాగంగా ఇటీవల ఓ కార్యక్రమంలో చిరు దంపతులు ఈ విషయాన్ని తెలియాజేశారు. అది ఒక సినిమా కోసం అని తెలిసి, మళ్ళీ సినిమా పరిశ్రమకు చెందినవారై ఉండి అంత బాధపడటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎంతైనా తల్లిదండ్రుల ప్రేమ అలాంటిది మరి. ఇక చిరంజీవి నటించిన సైరా చిత్రం రేపు విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు