ఎన్టీఆర్ కి బర్త్ డే విశెష్ చెప్పిన చిరు, మహేష్..!

ఎన్టీఆర్ కి బర్త్ డే విశెష్ చెప్పిన చిరు, మహేష్..!

Published on May 20, 2020 7:23 PM IST

ఎన్టీఆర్ బర్త్ డే వేళ ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. వారు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విశెష్ తెలియజేస్తూ తమ అభిమానం చాటుకుంటున్నారు. ఇక టాలీవుడ్ ప్రముఖులు సైతం ఎన్టీఆర్ కి బెస్ట్ విశెష్ చెవుతూ పోస్ట్స్ పెడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ కి ప్రత్యేకంగా బర్త్ డే విషెష్ చెప్పారు. హ్యాపీ బర్త్ డే భీమ్, నీ కలలు నెరవేరాలని కోరుకుంటున్నాను అని చిరు విష్ చేశారు. అలాగే మరో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ సైతం తన అధికారిక ట్విట్టర్ ద్వారా ఎన్టీఆర్ కి బెస్ట్ విశెష్ చెప్పారు.

మహేష్ ఎన్టీఆర్ ని ఉద్దేశిస్తూ.. హ్యాపీ బర్త్ డే బ్రదర్, అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను అన్నారు. టాలీవుడ్ లో ఎన్టీఆర్ కి మహేష్, చరణ్ మంచి మిత్రులుగా ఉన్నారు. ఇక చిరంజీవి సైతం ఎన్టీఆర్ ని అమితంగా ప్రేమించే వ్యక్తులలో ఒకరిగా ఉన్నారు. టాలీవుడ్ మెగాస్టార్, సూపర్ స్టార్ ఎన్టీఆర్ కి బర్త్ డే విషెష్ చెప్పడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు