మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ చిత్రంతో మొత్తానికి మంచి హిట్ కొట్టాడు. ఈ సినిమాకి మాత్రం కలెక్షన్స్ భారీగా వస్తున్నాయి. ఈ క్రమంలో మెగా సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. కాగా మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో కలిసి ఉప్పెన మూవీ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. మూవీ చాలా బాగా తీశారని దర్శకుడు బుచ్చిబాబును, నిర్మాతలను చిరంజీవి, రామ్ చరణ్ అభినందించారు.
కాగా ఈ క్రమంలో వైష్ణవ్ తేజ్, డైరెక్టర్లు సుకుమార్, బుచ్చిబాబు, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు అందరూ మెగాస్టార్ ను కలిశారు. ఇక ఉప్పెన చిత్రం తాలూకా స్ట్రీమింగ్ హక్కులను దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు. ఏప్రిల్ 11న ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రానుంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రంలోనే మంచి డైరెక్టర్ అనిపించుకున్నాడు.


