‘టాక్సీవాలా’కు మెగాస్టార్ అభినందనలు !

‘టాక్సీవాలా’కు మెగాస్టార్ అభినందనలు !

Published on Nov 28, 2018 4:21 PM IST

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నూతన దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘టాక్సీవాలా’ మొదటి వారం కలెక్షన్స్ తోనే లాభాల బాట పట్టి.. విజయ్ దేవరకొండ కెరీర్ లోనే ఈ చిత్రం మరో హిట్ చిత్రంగా నిలిచింది.

కాగా ఈ ఉదయం, మెగాస్టార్ చిరంజీవి టాక్సీవాలా చిత్రబృందాన్ని కలిసి అభినందించారు. టాక్సీవాలా నిర్మాత, దర్శకుడు మరియు హీరోయిన్ ప్రియాంకతో ఇంటరాక్ట్ అయిన మెగాస్టార్, వారి పనితనాన్ని మెచ్చుకుంటూ వారిని ప్రత్యేకంగా అభినందించారు.

పైరసీ అడ్డంకులను దాటుకొని థియేటర్లలోకి వచ్చిన ఈ టాక్సీవాలా అన్ని సెంటర్స్ లో మంచి రెవిన్యూని రాబడుతూ.. బాక్సాపీస్ వద్ద బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు