సీఎం జగన్ చేసిన పనికి చిరంజీవి చాలా సంతోషిస్తున్నారు

సీఎం జగన్ చేసిన పనికి చిరంజీవి చాలా సంతోషిస్తున్నారు

Published on Mar 25, 2021 11:17 PM IST

chiru jagan

మెగాస్టార్ చిరంజీవికి సైరా చిత్రం చాలా ప్రత్యేకమైంది. ఆ సినిమాతో చిరు తన కోరికను నెరవేర్చుకున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం మీద సినిమా చేయాలనేది చిరుకు ఎన్నో ఏళ్ల కల. చివరికి 2019లో సైరా చిత్రంతో ఆ కల నెరవేరింది. ఆ సినిమాతోనే తొలి స్వాతంత్ర్య సమరయోధుడు తెలుగు వ్యక్తేనని చాలామందికి తెలిసింది. ఇక తాజాగా ఆయన పేరును కర్నూలులో కట్టిన కొత్త విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును పెట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరుకు ఇంత పెద్ద మర్యాద దక్కడం ఇదే తొలిసారి. ఈ పని మూలాన ఉయ్యాలవాడ పేరు మరింత మందికి తెలుస్తుంది. ప్రభుత్వం ఇలా తన అభిమాన స్వాతంత్ర్య సమరయోధుడికి అతి పెద్ద గౌరవం ఇవ్వడంతో మెగాస్టార్ చిరు చాలా సంతోషిస్తున్నారు. ‘గౌరవనీయులైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. కర్నూలు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును పెట్టడం ఆయనకు తప్పనిసరిగా దక్కాల్సిన గౌరవం. అలాంటి గొప్ప వ్యక్తి పాత్రను పోషించడం అదృష్టంగా భావిస్తున్నాను’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు