విద్యారంగంలోకి అడుగుపెడుతున్న చిరంజీవి !

విద్యారంగంలోకి అడుగుపెడుతున్న చిరంజీవి !

Published on May 12, 2019 12:18 PM IST


ఇప్పటికే పలు సామాజిక కార్యక్రమాల్లో తనదైన పాత్ర పోషించిన మెగాస్టార్ చిరంజీవిగారు ఇప్పుడు విద్యారంగంలోకి కూడా అడుగుపెడుతున్నారు. చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరుతో విద్యాసంస్థల్ని ఏర్పాటు చేశారు. మొదట ఈ పాఠశాలలు శ్రీకాకుళం జిల్లాలో మొదలుకానున్నాయి. ఈ విద్యా సంవత్సరానికిగాను నర్సరీ నుండి 5వ తరగతి వరకు అడ్మిషన్స్ స్వీకరించడం జరుగుతుంది.

సమాజానికి అవసరమైనట్టు పిల్లల్ని తీర్చిద్దడమే మా విద్యాసంస్థల లక్ష్యం అనే నినాదంతో చిరంజీవి వీటిని స్థాపించడం జరిగింది. తక్కువ ఫీజులతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో వీటిని ఏర్పాటు చేశారట. అంతేకాదు ఈ పాఠశాలల్లో మెగాస్టార్ అభిమానుల పిల్లలకు ప్రత్యేకమైన రాయితీలు ఉండనున్నాయి. ప్రస్తుతం ఈ పాఠశాలలు రామ్ చరణ్, నాగబాబులు ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. త్వరలోనే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ముఖ్య నగరాల్లో ఇంకొన్ని శాఖల్ని ఏర్పాటు చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు